వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,31,243 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయం • తెలుగు టైపుచేయుట

విహరణ • విశేష వ్యాసాలు • అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఎనిమిది జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా కేంద్రం అనంతపురం. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత పొడి ప్రాంతాలలో ఒకటి. 2022లో, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిరప, అరటి, నువ్వులు, చెరుకు, పట్టు. అనంతపురము అనే పేరు అనంతసాగరం అనే జలాశయం పేరు నుంచి వచ్చిందని భావిస్తారు. అనంతసాగరం అంటే పెద్ద చెరువు లేదా అంతులేని సముద్రం అని అర్థం. మొదటి బుక్క రాయల మంత్రి చిక్కప్ప వడెయార్ అనంతసాగరం, బుక్కరాయసముద్రం గ్రామాలను నిర్మించినట్లు పేర్కొంటారు. విజయనగర సామ్రాజ్యం స్థాపకుల్లో ఒకరైన మొదటి బుక్క రాయల భార్య అనంతమ్మ పేరు మీద అనంతసాగరానికి ఆ పేరు వచ్చిందని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బుక్క రాయల భార్య పేరు అనంతమ్మ కాదని, అనంతరస చిక్కవోడెయా పేరు మీదుగానే ఈ పేరు ఏర్పడి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అనంతపురం ప్రాంత చరిత్రకు సంబంధించిన తొలి ఆధారాలలో అశోకుని శిలాశాసనాలు ముఖ్యమైనవి. 1892లో రాయదుర్గ తాలూకాకు పశ్చిమాన ఉన్న అప్పటి మైసూరు ప్రాంతంలో అశోకుని శిలాశాసనాలు గుర్తించబడ్డాయి. వాటి కాలం సుమారు క్రీ.పూ. 258గా పేర్కొనబడింది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... కేరళ రాజకుటుంబానికి చెందిన రవివర్మ మార్తాండ వర్మ నిమ్హాన్స్ ఆసుపత్రి వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకడనీ!
  • ... హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రా కోట హిమాలయా ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన కోటల్లో ఒకటనీ!
  • ... కుకి నేషనల్ ఆర్మీ అనేది ఈశాన్య భారతదేశం, ఎగువ మయన్మార్ ప్రాంతాలలో చురుకుగా ఉన్న తీవ్రవాద సంస్థ అనీ!
  • ... భారతీయ సంస్కృతి, రామాయణం ఆగ్నేయాసియా దేశాలపై ఎంతటి బలమైన ముద్ర వేశాయో చెప్పడానికి అయుత్తయ నగరం ఒక సజీవ సాక్ష్యం అనీ!
చరిత్రలో ఈ రోజు
నవంబరు 21:
ఈ వారపు బొమ్మ
ప్రముఖ ఆంగ్ల రచయిత, కవి, నాటకకర్త ఆస్కార్ వైల్డ్

ప్రముఖ ఆంగ్ల రచయిత, కవి, నాటకకర్త ఆస్కార్ వైల్డ్

ఫోటో సౌజన్యం: Napoléon Sarony
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.